ఆని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే, దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క సామాన్య వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది ముగింపు (మరియు దేవుడు దేవుడు కానియెడల, అప్పుడు దేవుడే లేడు). “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది మన సామాన్య ప్రశ్న కంటే కొంత క్లిష్టమైన ప్రశ్న. ఏమి కూడా శూన్యము నుండి రాదని అందరికి తెలుసు. కాబట్టి, దేవుడు “ఒకరు” అయిన యెడల, ఆయనకు కూడా ఒక కారణం ఉండాలి కదా?

ఇది దేవుడు ఏదో ఒక దాని నుండి వచ్చాడు అని మరియు అది ఎక్కడ నుండి అనే ఒక అబద్ద ఆలోచనను ఇస్తుంది కాబట్టి ఇది క్లిష్టమైన ప్రశ్న. ఇది అర్థములేని ప్రశ్న అనేదే దీని జవాబు. “నీలిరంగు యొక్క వాసన ఎలా ఉంటుంది?” అని అడిగినట్లు ఉంది ఇది. నీలిరంగు వాసన ఇచ్చు పదార్థం కాదు కాబట్టి, ఆ ప్రశ్నే సరికానిది. అదే విధంగా, దేవుడు కూడా సృష్టించబడిన వస్తువుల కోవలో లేడు. దేవుడు కారణము లేనివాడు మరియు సృష్టించబడనివాడు-ఆయన కేవలం ఉన్నాడు అంతే.

ఇది మనకు ఎలా తెలుసు? శూన్యం నుండి ఏమి రాదని మనకు తెలుసు. కాబట్టి, ఒకానొకప్పుడు ఏమి లేని శూన్య సమయం ఉండియుంటే, దానిలో నుండి ఏది ఉనికిలోనికి వెచ్చేది కాదు. కాని వస్తువులు ఉన్నాయి. కాబట్టి, కాబట్టి, ఎన్నడు కూడా ఏమి లేకుండా లేదు కాబట్టి, ఏదో ఒకటి ఎల్లప్పుడూ ఉనికిలో ఉండియుండాలి. ఆ ఉండియుండాలి అనే దీనినే మనం దేవుడు అని అంటాము. దేవుడు అన్నిటిని సృష్టించిన సృష్టించబడని కారణము లేనివాడు. దేవుడు లోకములో సమస్తమును సృష్టించిన సృష్టించబడని సృష్టికర్త.