ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను (1:1).

దేవునిలో గొప్ప కళాత్మక ఉన్నది

ఈ లోకములో ఎంతోమంది కళాకారులు, చిత్రకారులు, కవులు ఉన్నారు. కానీ ఎవరు వర్ణించినా, ఏదైనా తయారుచేసిన అవి దేవుడు చేసిన సృష్టిలోని వస్తువులను పోలి ఉంటాయి లేదా వాటితో పోల్చబడి కవితలు, గేయములు వ్రాయబడతాయి. చిత్రకారులు కూడా ప్రకృతిలోని అంశములను చిత్రీకరించి గొప్ప చిత్రాలను గీయటము జరిగినది. వీరిలో ఎవరూ కూడా దేవుని సృష్టిలోని వాటి పరిధి దాటి ప్రస్తావించిన, వర్ణించిన అంశములు ఏమీకూడా లేవు. ఇవి అన్నీకూడా దేవుని చేత చేయబడినా కూడా ఆయన యొక్క కళాత్మకతను మనము గుర్తించడానికి బదులు వ్యక్తులను గుర్తిస్తాము. వారిని గౌరవిస్తూ ఉంటాము. వారు చేసినవాటిని గొప్ప వెలకు కొనుగోలు చేస్తాము. కానీ వీటన్నింటికి వెనుక ఉన్న ప్రేరణ దేవుని సృష్టి అనే విషయం మర్చిపోతాము. ఇకనుంచి అయినా దేవునిలో ఉన్న సృజనాత్మకత, కళను గుర్తిద్దాము. ఎన్నో కోట్లకొలది నక్షత్రములు, గ్రహములు ఉన్నాకూడా ప్రతి దానికి ప్రత్యేకత ఇవ్వడం అనేది, వాటికి ఉనికి కలిగించడము అనేది దేవునికే చెల్లింది. అన్నింటికీ వాటి గుర్తింపుకు తగినట్లుగా పేర్లు పెట్టడం జరిగినది. సృష్టిలో ఏదీకూడా వృథాగా చేయబడలేదు. దేని స్థానము దానికి కలదు. మనమందరము కూడా ఆయన సృజనాత్మకతలో భాగము అయినందుకు ధన్యులము. Each of us are master pieces made by the hand of GOD.

దేవుని కనుదృష్టి నిన్ను చూస్తూ ఉంది

చిన్న గ్రహములు పెద్ద గ్రహముల చుట్టూ తిరగడం అనేది ఈ సృష్టిలో మనము గమనించగలము. అలానే మనకు అన్నింటిలోనూ పెద్ద అయిన మన దేవుని చుట్టూ మనము తిరగాలి. ఆయన చేతి నీడలోనే మనకు పరిపూర్ణ సంరక్షణ కలదు.

సూర్యుడు, చంద్రుని కాంతి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణంచేసి మన ఇంటిలోనికి ప్రసరిస్తుంది. భూమి యొక్క ఆకారములుతో పోల్చుకుంటే మనం నివసించే ప్రదేశం దుమ్ముకణము కన్నా చిన్నది. లెక్కలోనికి రానిది. అలాంటి చోటుకు సహితము ఆయన చేత సృష్టింపబడిన వస్తువులు తమ కాంతిని ప్రసరింప జేయగలిగినప్పుడు, ఆయన కనుదృష్టి మనలను మరింత తేటగా దర్శిస్తుంది. కనుక మనము ఏ విషయములోనూ భయపడి అధైర్యపడవలసిన పనిలేదు

దేవుని యొక్క కనుదృష్టిని మరుగుచేసి ఈ విశ్వంలో మనకు హాని చేయగలిగినది ఒకటి కూడా లేదు.

ఈ విశ్వములో దేవుని యొక్క హస్తము చేరలేని ప్రదేశము లేదు. కాబట్టి నువ్వు ఆయనకు ఎంత దూరముగా జరిగినా, ఎంత లోతులో కూరుకుపోయినా, నువ్వు ఉన్నచోటికి ఆయన హస్తం వచ్చి నిన్ను రక్షించగలదు, పైకి లాగగలదు

ఆయన నీకోసం చూస్తున్నాడు

ఇంతమంచి లక్షణములు, జ్ఞానము, శక్తి, పరపతి కలిగిన వ్యక్తుల కోసము లోకములో అందరూ పరితపిస్తారు. అయితే మనము దేవుని పరిచయం కొరకు, ఆయన దగ్గర వరుసలో నిలిచి వేచిచూడడానికి బదులు ఆయనే మన తలుపు దగ్గర నుంచుని తడుతున్నాడు. మనలో చాలామందిమి ఆయనకు తలుపు తీయకుండా నిరీక్షించేలా చేయడము శోచనీయము, బాధాకరము. ఈ లోకంలోని గొప్పవారు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. వారి కోసము మనము పడిగాపులు పడాలి. అదికూడా నిర్ణీత సమయంలోనే వారు అందుబాటులో ఉంటారు. కానీ దేవుడు మనకు ఎల్లవేళలా ఎప్పుడూ ప్రార్థన రూపంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పటికి అయినా ఆయన స్నేహం విలువ గుర్తిద్దాము.

గ్రహములు తమ కక్ష్యను వీడినప్పుడు నాశనము చెందడం జరుగుతుంది. వాటిని తిరిగి సరిచేసే మార్గము లేదు. కానీ మానవుడు తన పరిధి దాటి పాపములో పడినప్పుడు దేవుడు మనము నాశనం కాకుండా కాపాడారు. తన కుమారుని ప్రాణం ధారపోశారు. మరల మనలను విడిపించి సరిదిద్దారు. ఆయన సృష్టిలో మనము ఎంత ఆయనకు ప్రాముఖ్యమో గుర్తించాలి. ఆయన ప్రేమకు త్యాగమునకు స్పందించాలి.

సృష్టికర్త దగ్గరనుంచి ఇన్ని మంచి అవకాశములు విడిచిపెట్టుకుని ఆయనను తిరస్కరించి దూరముగా ఉంటే మనకన్నా దురదృష్టవంతులు, తెలివిలేనివారు ఎవరూ ఉండరు. ఆయనను (ఇంత గొప్ప దేవుని) తెలుసుకొనకపోవడమే జీవితములో నిజమైన, అతి పెద్ద శాపము

About admin

This author has not yet filled in any details.
So far admin has created 600 blog entries.

Proverbs Synopsis

2023-05-02T14:17:06+05:30

మానవ వస్త్రంలో నేయబడింది నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవాలనే కోరిక. మన

Proverbs Synopsis2023-05-02T14:17:06+05:30

Psalms Synopsis

2023-04-22T16:42:25+05:30

కీర్తనల పుస్తక౦, స౦ఘ ఆరాధనలో ఉపయోగి౦చడానికి, అలాగే వ్యక్తిగత భక్తిలో ఉపయోగి౦చడానికి

Psalms Synopsis2023-04-22T16:42:25+05:30

Job Synopsis

2023-04-21T00:07:18+05:30

యోబు అనే పుస్తక౦ ,దేవుని యొక్క కుమారుడు, యోబు కోసం చెబుతో౦ది.

Job Synopsis2023-04-21T00:07:18+05:30

Nehemiah Synopsis

2023-04-19T23:18:12+05:30

నెహెమ్యా దేవునిపై మన విశ్వాస౦ లోని ఆచరణాత్మకమైన, దైవీకమైన తత్వం వ్యక్త౦

Nehemiah Synopsis2023-04-19T23:18:12+05:30

Ezra Synopsis

2023-04-19T23:01:31+05:30

ఎజ్రా ఒక యాజకుడు, శాస్త్రీ , గొప్ప నాయకుడు. ఆయన పేరుకు

Ezra Synopsis2023-04-19T23:01:31+05:30

2Chronicles Synopsis

2023-04-17T23:56:34+05:30

రెండవ దినవృత్తా౦తములు మొదటి దినవృత్తా౦తములు చరిత్రను కొనసాగి౦చాయి. దావీదు కుమారుడు సొలొమోను

2Chronicles Synopsis2023-04-17T23:56:34+05:30

1Chronicles Synopsis

2023-04-17T18:18:57+05:30

యెరూషలేముకు తిరిగి వచ్చినవారికి ప్రోత్సాహాన్ని, ఉద్బోధను అ౦ది౦చడ౦ అనే ద్వంద్వ స౦కల్ప౦

1Chronicles Synopsis2023-04-17T18:18:57+05:30
Go to Top